Wednesday, September 23, 2026
E-PAPER
Homeఆటలుమహిళల టీ20 ప్రపంచకప్‌: నేడే భారత్-పాక్ మ్యాచ్

మహిళల టీ20 ప్రపంచకప్‌: నేడే భారత్-పాక్ మ్యాచ్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు, చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తమ తొలి పోరులో తలపడనుంది. గతేడాది వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టు, టీ20 కిరీటాన్ని కూడా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. పాక్‌తో పోలిస్తే భారత జట్టు సమతూకంగా ఉన్నప్పటికీ, ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. మిడిలార్డర్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, భారతి ఫుల్మాలి, యాస్తికా భాటియా, దీప్తి శర్మ రాణించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -