ఎన్నికలప్ప్పుడే కాకుండా
నిత్యం ప్రజల్లో ఉండాలి
పార్టీ శ్రేణులకు మంత్రి సీతక్క, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపు
నిజామాబాద్‌లో ఉమ్మడి జిల్లా పీఏసీ సమావేశం
సర్‌పై డీసీసీలు ప్రత్యేక దృష్టిసారించాలి
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
‘ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త బాధ్యత. పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంలో నాయకులు చురుకుగా పనిచేయాలి’ అని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దనసరి అనసూయ (సీతక్క) పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రం దుబ్బ ప్రాంతంలోని ఎంకే గార్డెన్‌లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నాయకులు ముందుండాలని తెలిపారు. మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. ఓటరు జాబితాల సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు అధికంగా జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. బీఎల్‌ఏలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. 2002 ఆధారిత పత్రాల పరిశీలనతో పాటు ఓటరు జాబితాల వివరాల విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని, సవరణ ప్రక్రియ సజావుగా జరగని ప్రాంతాలపై డీసీసీ అధ్యక్షులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మండల కాంగ్రెస్ కమిటీల నియామక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని అన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత పటిష్టంగా నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్‌లో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలని, బూత్ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా నిరంతరం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవాలని అన్నారు. కొత్తగా పార్టీకి వచ్చే యువతను ప్రోత్సహిస్తూ వారికి సంస్థాగత బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ సురేష్ శెట్కర్, ఎమ్మెల్యే మదన్ మోహన్, మేయర్ ఉమారాణి, కార్పొరేషన్, కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, మల్లికార్జున్, కార్పొరేషన్ చైర్మెన్లు, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, ఆకుల లలిత, బూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జీలు సునీల్ రెడ్డి, వినయ్ రెడ్డి, యూసఫ్ అలీ, కాసుల బాలరాజ్, అరికెల నర్సారెడ్డి, కార్పొరేషన్ చైర్మెన్లు మనాల మోహన్ రెడ్డి, ఇరవత్రి అనిల్, కేశ వేణు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పోచారం మాకొద్దు :
బాన్సువాడ కాంగ్రెస్ నాయకుల నినాదాలు
నగరంలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశానికి వచ్చిన aమాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి గ్రూపు నాయకులు గార్డెన్ ఎదుట బైటాయించారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి తమకు అవసరం లేదని, వెంటనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. బాన్సువాడలో పోచారం తీరుతో కాంగ్రెస్ పార్టీతో తీవ్ర నష్టం ఏర్పడుతోందన్నారు. ఆయన నిర్ణయాల కారణంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. వెంటనే ఆయనను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు.
ప్రజాసమస్యల పరిష్కారంపై చురుగ్గా పనిచేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



