రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న పాలకులు
దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాలి
ప్రాథమిక హక్కులను రక్షించుకోవాలి : సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
రాజ్యాంగ పరిరక్షణలో కార్మికులు కీలకపాత్ర పోషించాలని సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం. సాయిబాబు సూచించారు. సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ సందర్భంగా సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్‌లో ”రాజ్యాంగ పరిరక్షణ-సవాళ్లు” అనే అంశంపై సోమవారం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రజల హక్కుల రక్షణ కోసం రూపొందించబడిందన్నారు. దేశంలో విభిన్న జాతులు, మతాలు, కులాలు ఉండటంతో లౌకికవాద పరిరక్షణకు దోహదం చేస్తూ భారత రాజ్యాంగాన్ని తయారు చేశారని వివరించారు. డా.బీఆర్. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాం గంలో ప్రజలకు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్ర హక్కులు కల్పించారని తెలిపారు. కానీ నేడు పాలకులు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ లాభాల కోసం రాజ్యాంగాన్ని మారుస్తున్నారని ఆరోపిం చారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత కార్మికులు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్టికల్ 19 ప్రకారం కార్మికులకు నిరసన తెలిపే హక్కు, సమ్మె చేసే హక్కు, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ వంటివి వచ్చాయన్నారు. ఆ ఆర్టికల్ ద్వారానే కార్మికులు యాజమాన్యాలతో మాట్లాడి తమ సమస్యలను పరిష్కరించుకునే వీలు ఉండేదన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్‌లు తీసుకొచ్చిందని, వీటితో హక్కులను హరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అందరికీ ఆర్థిక సమానత్వం
రాజ్యాంగం అందరికీ ఆర్థిక సమానత్వం కల్పించిందని సాయిబాబు తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వం దేశ సంపదంతా కార్పొరేట్లకు దోచిపెడుతోందని విమర్శించారు. అంతేకాకుండా ప్రధానమంత్రి సామ్రాజ్యవాదం అడుగులకు మడుగులొత్తుతూ దేశాన్ని ఇతర దేశాలకు తాకట్టుపెడుతున్నారని ఆరోపించారు. దేశ సార్వభౌ మాధికా రాన్ని అమెరికాకు తాకట్టుపెడుతూ వారు చెప్పినట్టుగా పనిచేస్తూ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తు న్నారన్నారు. దేశంలో అందరికీ తిండిపెడుతున్న రైతన్న మాత్రం ఆకలి చావులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన విత్తన చట్టం తీసుకొచ్చి రైతులు స్వయంగా తయారు చేసుకున్న విత్తనాలను వినియోగించకుండా చేస్తున్నారన్నారు. దేశంలో కొద్దిమంది చేతిలోనే సంపద పోగుపడిందని, చిన్న సూది నుంచి పెద్ద వస్తువుల వరకు అదానీ, అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తల కంట్రోల్‌లోనే ఉన్నాయని అన్నారు. ఈ సెమినార్‌లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు, కోశాధికారి కె.రాజయ్య, ఉపాధ్యక్షులు మాణిక్యం, ప్రవీన్ కుమార్, బాగారెడ్డి, యాదగిరి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణలో కార్మికులది కీలకపాత్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



