మే డే స్ఫూర్తితో కార్మికులు ఉద్యమించాలి: నాయక్ వాడి శ్రీనివాస్

నవతెలంగాణ – నవీపేట్
ప్రపంచ కార్మికుల పండగ మేడే స్ఫూర్తితో కార్మికులు ఉద్యమించి తమ హక్కులను సాధించుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సీఐటీయూ మండల అధ్యక్షులు మేకల ఆంజనేయులు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి అనంతరం సుందరయ్య కాలనీలో జెండాను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికుల వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని అన్నారు. కాబట్టి కార్మికులంతా ఏకమై తమ హక్కుల సాధన కోసం ఉద్యమించాలని అన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.26,000, పీఎఫ్ ఈఎస్ఐ మరియు ఉద్యోగ భద్రతను కల్పించాలని అన్నారు. అలాగే ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇంటి స్థలాలతో పాటు లోన్లు ఇచ్చి నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు దేవకి, అంగన్వాడి శివరాజమ్మ, సుందరయ్య కాలనీవాసులు వసంత్, గోల్ల సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
Spread the love