
నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్
మత్స్య కారులు ఆర్థికాభివృద్ది సాధించేందుకు, మత్స్యకార ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం కోసం కృషి చేస్తానని ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల రవీందర్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మత్స్యకారులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్స్యకార ఉత్పత్తి దారుల సంఘాల పాలకవర్గ సభ్యులకు సంఘం పనితీరు పై ఎప్పటికప్పుడు సమక్షించుకోవాలని సూచించారు. హుస్నాబాద్ ఫిషరీస్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఛైర్మెన్ పొన్నబోయిన శ్రీనివాస్, కార్యదర్శి ఆళ్ళ రాములు, డైరెక్టర్లు యెడల వనేష్, కోల లింగయ్య, పిట్టల బాలయ్య, గీకురు సంపత్, బొడిగే రాజయ్య, సున్నపు రమేష్, పొన్నం మల్లయ్య, మౌటం ఐలయ్య, పోలుఆంజనేయులు ఆయా గ్రామాల ముదిరాజ్ సంఘ నాయకులు,యువకులు,మత్స్యకార సంఘ అధ్యక్షులు, డైరెక్టర్లు పాల్గొన్నారు.