అసోం యూనివర్సిటీ పరిశోధకుల అద్భుత ఆవిష్కరణ
లఖిమీ దేశీయ జాతి పరిరక్షణలో కీలక ముందడుగు
పాడి అభివృద్ధి, రైతుల ఆదాయం పెంపునకు దోహదం
దిస్పూర్ : దేశీయ పశు జాతుల పరిరక్షణలో అసోం మరో కీలక ముందడుగు వేసింది. పశుసంవర్ధక, బయోటెక్నాలజీ రంగంలో ఒక చరిత్రాత్మక మైలురాయిని నమోదు చేసింది. అసోం రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ స్వదేశీ ‘లఖిమి’ జాతికి చెందిన ఆడ దూడ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా జన్మించింది. ప్రపంచంలో ఐవీఎఫ్ పద్ధతిలో దూడ జన్మించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. రాష్ట్రంలోని పశు సంపద సంరక్షణ, పాడి పరిశ్రమ అభివృద్ధి దిశగా పరిశోధనలు చేస్తున్న అసోం వెటర్నరీ అండ్ ఫిషరీ యూనివర్సిటీ ఈ ఘనత సాధించింది. దేశీయ పశు జాతుల పరిరక్షణతో పాటు పాల ఉత్పత్తిని పెంచేందుకు ఈ సాంకేతికత కీలకంగా మారుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘రాష్ట్రీయ గోకుల మిషన్’ ఆర్థిక సహాయంతో అసోం వెటర్నరీ అండ్ ఫిషరీ యూనివర్సిటీ పరిధిలోని ప్రయోగశాలలో దీనికి సంబంధించిన ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. స్వచ్ఛమైన లఖిమి జాతి ఆవు పిండం ద్వారా ఈ ఆడ దూడను ఉత్పత్తి చేశారు. దేశీయ పశు జాతుల జన్యు వనరులను కాపాడుకోవడంతో పాటు వాటి సంఖ్యను పెంచేందుకు ఈ సాంకేతికతను ఉపయోగించవచ్చని పరిశోధకులు చెప్పారు.
ప్రపంచంలోనే తొలి ఐవీఎఫ్ దూడ జననం
- Advertisement -
- Advertisement -



