Monday, August 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతోడే బాలచందర్‌కు జాన్‌వెస్లీ నివాళి

తోడే బాలచందర్‌కు జాన్‌వెస్లీ నివాళి

- Advertisement -


అంత్యక్రియలకు హాజరు
నవతెలంగాణ-మంచాల

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు తోడే అడవయ్య చిన్న కుమారుడు బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి తోడే బాల చందర్ అంత్యక్రియలకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిదేడ్‌ ‌గ్రామానికి చెందిన తోడే బాల చందర్‌ అనారోగ్యంతో బాధపడుతూ శనివారం హైదరాబాద్‌‌లో మృతిచెందారు. ఆదివారం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాన్‌‌వెస్లీ హాజరై బాల చందర్‌ ‌మృతదేహంపై పూలమాల వేసి నివాళి అర్పించారు. మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర సీనియర్‌ నాయకులు డీజీ నర్సింహారావు, పెసరిగాయల జంగా రెడ్డి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, సీపీఐ(ఎంఎల్‌)న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఝాన్సీ, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.సామెల్, దుబ్బాక రామచందర్, కందుకూరి జగన్, మంచాల మండల కార్యదర్శి రావుల జంగయ్య, యాచారం మండల కార్యదర్శి అలంపల్లి నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -