
ఈనెల 6 ,7 తేదీలలో హనుమకొండ జిల్లాలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పురుషుల, మహిళల యూత్ ఛాంపియన్ షిప్ పోటీలలో యాదాద్రి భువనగిరి జిల్లా అథ్లెట్స్ 4 గోల్డ్ మెడల్స్ 8 సిల్వర్ మెడల్స్ 3 బ్రాంజ్ మెడల్స్ తో మొత్తం 15 పథకాలను సాధించి రాష్ట్రస్థాయిలో ముందు వరుసలో నిలిచారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి వెంకటేశ్వర్లు, కోనేటి గోపాల్ లు సంయుక్త ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్ర స్థాయి పథకాలు సాధించిన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు స్టాన్లీ జోన్స్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సారంగపాణి , జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోతoశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గం అభినందించారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కోనేటి గోపాల్ తెలియజేశారు. పథకాలు సాధించిన వారు మల్లిక 10000మీ ప్రథమ & 5000మీ ద్వితీయ, సునీల్ 5000మీ సిల్వర్& 1500మీ సిల్వర్, సచిన్ డిస్కస్ త్రో ప్రథమ, చంద్రశేఖర్ ప్రసాద్ స్టీఫుల్ చేజ్ ద్వితీయ, నిఖిత 400మీ &400హార్డీల్స్ ప్రథమ, ప్రదీప్ హ్యమర్ త్రో ద్వితీయ, బుచ్చమ్మ షాట్ ఫుట్ ద్వితీయ, ఉషారాణి 1500మీ తృతీయ పవన్ రాజ్ 150మీ ప్రథమ, రాహుల్ డిస్కస్ త్రో ద్వితీయ లు ఉన్నారు.