యాదాద్రి భువనగిరి జిల్లాలో అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలి..

– ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐల్లయ్య…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరు కలిసి యాదాద్రి భువనగిరి జిల్లాలో కోఆర్డినేట్ చేసుకుంటూ అభివృద్ధిలో ముందు ఉంచాలని ఆలేరు  ఎమ్మెల్యే,  ప్రభుత్వ విప్ బీ ర్ల ఐల్లయ్య అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్  సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అధ్యక్షత నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఆయన హాజరై,  మాట్లాడారు. రేపటి నుంచి పాఠశాలలో ప్రారంభం అవుతున్నాయని విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ బడీలలో విద్యార్థుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని, ఆర్టీసీ అధికారులు విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా బస్సులు నడపడాలని సూచించారు. వర్షాకాలం ప్రారంభమవుతున్నందున గ్రామాలలో శానిటేషన్ పనులను అధికారులు చేపట్టాలని సూచించారు. అందరూ అధికారులు సమన్వయంతో పని చేస్తూ ఒకరి సహకారం మరొకరు తీసుకొని జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే, జిల్లా పరిషత్ సీఈవో ఎన్ శోభారాణి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల స్వామేలు, కాంగ్రెస్ జడ్పీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ నగేష్, జెడ్పిటిసిలు, ఎంపీపీలు  జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Spread the love