
జూన్ 6, 7 లో మండల కేంద్రంలోని కామ్రేడ్ తోట్ల మల్సూర్ స్మారక భవనంలో జరిగే సీపీఐ(ఎం) శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో మాట్లాడుతూ తుంగతుర్తి మద్దిరాల నూతనకల్ మండల పరిధిలోని సీపీఐ(ఎం) కార్యకర్తలకు, పార్టీ సభ్యులకు జరిగే శిక్షణ తరగతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి మండల కార్యదర్శిలు బుర్ర శ్రీనివాస్ కందాల శంకర్ రెడ్డి కల్లేపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.