గడపగడపకూ వెళ్లాలి…

I have to go to Gadapa Gadapa...– అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలి
– అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌లకు కేటీఆర్‌ దిశానిర్దేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని గడప గడపకు వెళ్లాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఆ పార్టీ అసెంబ్లీ ఇన్‌ ఛార్జీలను ఆదేశించారు. బీఆర్‌ఎస్‌ 54 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జీల జాబితాను విడుదల చేసిన సందర్భంగా గురువారం ఆయన వారితో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వం పదేండ్లలో చేసిన అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి ఓట్లడగాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీలకు కేవలం హామీలు ఇచ్చేందుకే అవకాశముందనీ, బీఆర్‌ఎస్‌కు చేసిన ప్రగతిని చెప్పుకునే అద్భుతమైన అవకాశముందని తెలిపారు. సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరితో మమేకం కావాలని సూచించారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అగ్రస్థానంలో నెలబెట్టేలా అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా తీసుకెళ్లిన బీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టనున్నారని చెప్పారు. ఇప్పటి నుంచే పార్టీ విజయానికి అవసరమైన కార్యాచరణను, కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. వెంటనే రంగంలోకి దిగాలనీ, ఎన్నికలు ఫలితాలు వెలువడే రోజు వరకు ఆయా నియోజకవర్గాల సంపూర్ణ బాధ్యతను తీసుకోవాలని సూచించారు. పార్టీ శ్రేణులన్నింటినీ సమన్వయం చేసుకుని ప్రచార బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. రానున్న 45 రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బూత్‌ కమిటీల నిర్వహణ మొదలుకుని నియోజకవర్గ స్థాయి వరకు అన్ని దశల్లో ప్రచారం పకడ్బందీగా జరిగేలా సమగ్ర ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌ లో మంత్రి హరీశ్‌ రావు ఇన్‌ ఛార్జీలకు పలు సూచనలిచ్చారు.
ఇన్‌చార్జీలు వీరే..
1. బెల్లంపల్లి – ఎంపీ వెంకటేశ్‌ నేత
2. మంచిర్యాల – ఎమ్మెల్సీ భానుప్రసాద్‌
3. ఖానాపూర్‌ – ఎమ్మెల్సీ దండె విఠల్‌
4. బోథ్‌ – మాజీ ఎంపీ నగేశ్‌
5. ముదోల్‌ -మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ కుమార్‌
6. బోధన్‌ – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
7. ఎల్లారెడ్డి -మాజీ ఎమ్మెల్సీ వీ..గంగాధర్‌ గౌడ్‌
8. కామారెడ్డి -ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డి, మంత్రి కేటీఆర్‌
9. నిజామాబాద్‌ అర్బన్‌ – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
10. జగిత్యాల – ఎమ్మెల్సీ రమణ, మాజీ మంత్రి రాజేశం గౌడ్‌
11. రామగుండం – మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌
12. మంథని – ఈద శంకర్‌ రెడ్డి
13. పెద్దపల్లి -చైర్మెన్‌ రవీందర్‌ సింగ్‌
14. చొప్పదండి – మంత్రి గంగుల కమలాకర్‌
15. వేములవాడ – మాజీ ఎంపీ బి.వినోద్‌ కుమార్‌
16. మానకొండూరు – సుడా చైర్మెన్‌ జీవీ రామకృష్ణ
17. మెదక్‌ – కే తిరుపతి రెడ్డి (మెదక్‌)
18. ఆందోల్‌ -మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్‌ హుస్సేన్‌
19. నర్సాపూర్‌ – ఎమ్మెల్సీ వెంకటరాం రెడ్డి
20. జహీరాబాద్‌ – మాజీ చైర్మెన్‌ దేవీ ప్రసాద్‌
21. సంగారెడ్డి – చైర్మెన్‌ వీ భూపాల్‌ రెడ్డి, చైర్మెన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌
22. దుబ్బాక – చైర్మెన్‌ బాలమల్లు
23. గజ్వేల్‌ – మంత్రి హరీశ్‌ రావు, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, చైర్మెన్‌ ప్రతాప్‌ రెడ్డి
24. మల్కాజ్‌గిరి – ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు
25. ఉప్పల్‌ – చైర్మెన్‌ రావుల శ్రీధర్‌ రెడ్డి
26. ఇబ్రహీంపట్నం – మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి
27. చేవెళ్ల – ఎంపీ రంజిత్‌ రెడ్డి
28. వికారాబాద్‌ – ఎంపీ రంజిత్‌ రెడ్డి
29. ముషీరాబాద్‌ – ఎమ్మెల్సీ ఎంఎస్‌ ప్రభాకర్‌
30. అంబర్‌పేట్‌ – కట్టెల శ్రీనివాస్‌ యాదవ్‌, అడ్వకేట్‌ మోహన్‌ రావు
31. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ – మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
32. మక్తల్‌ – చైర్మెన్‌ ఆంజనేయులు గౌడ్‌
33. గద్వాల్‌ -మాజీ చైర్మెన్‌ రాకేశ్‌ చిరుమళ్ల
34. అలంపూర్‌ – ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్‌ రెడ్డి
35. అచ్చంపేట – చైర్మెన్‌ ఇంతియాజ్‌ ఇషాక్‌
36. కల్వకుర్తి- చైర్మెన్‌ గోలి శ్రీనివాస్‌ రెడ్డి
37. కొల్లాపూర్‌ – ఎంపీ రాములు
38. నాగార్జున సాగర్‌ – ఎమ్మెల్సీ కోటి రెడ్డి, రామచంద్ర నాయక్‌
39. హుజుర్‌ నగర్‌ – విజయసింహా రెడ్డి (నల్లగొండ)
40. కోదాడ – ఎమ్మెల్సీ టీ.రవీందర్‌ రావు
41. నల్లగొండ – జడ్పీ చైర్మెన్‌ బండా నరేందర్‌ రెడ్డి
42. నకిరేకల్‌ – ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌
43. జనగామ – మాజీ ఎమ్మెల్సీ బీ వెంకటేశ్వర్లు,చైర్మెన్‌ రాజయ్య, హరీశ్‌రావు
44. మహబూబాబాద్‌ – మంత్రి సత్యవతి రాథోడ్‌
45. నర్సంపేట – చైర్మెన్‌ వీ.ప్రకాశ్‌
46. వరంగల్‌ ఈస్ట్‌ – మండలి డిప్యూటీ చైర్మెన్‌ బండా ప్రకాశ్‌
47. భూపాలపల్లి – ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య
48. ములుగు – ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి
49. ఇల్లందు – ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
50. మధిర -మంత్రి పువ్వాడ అజరు, కొండబాల కోటేశ్వర్‌ రావు
51. వైరా – ఎంపీ నామా నాగేశ్వర్‌ రావు
52. సత్తుపల్లి – ఎంపీ పార్థసారథి రెడ్డి
53. అశ్వరావుపేట – శేషగిరావు (ఖమ్మం డీసీఎంఎస్‌)
54. భద్రాచలం – ఎమ్మెల్సీ తాత మధు

Spread the love