సాంకేతిక విధానంతో యువతకు ఉపాధి..

– యువకులతో మాజీ ఎంపీ వినోద్ కుమార్ 
– పురుగుల మందు డ్రోన్ పిచికారీ యంత్రం పరిశీలన 
నవతెలంగాణ – బెజ్జంకి 
వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన యంత్రాలు యువతకు ఉపాధి కల్పిస్తున్నాయని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్ నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న క్రమంలో మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామ శివారులో యువకులు డ్రోన్ యంత్రం ద్వారా పురుగుల మందు పిచికారీ చేయడాన్ని బోయినిపల్లి వినోద్ కుమార్ గమనించి యువకులతో  మాట్లాడారు.యువత అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని వ్యాపార రంగాల్లో స్థిరపడాలని యువతకు వినోద్ కుమార్ సూచించారు.
Spread the love