లక్కోరా గ్రామ యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
వేల్పూర్ మండలం లక్కోరా గ్రామానికి చెందిన యువకులు గురువారం బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన చిన్న స్వామి, జయరాజ్, ప్రేమ్ రాజ్, అక్షయ్, అభి, చందు, ప్రభాస్, చరణ్, ద్వారకేష్, గంగారెడ్డి, హరీష్, దిన్ను తదితరులు కాంగ్రెస్ లో చేరారు.వారందరికీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్  ముత్యాల సునీల్ కుమార్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా  ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువకులను ఉద్దేశించి సునీల్ కుమార్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి  గెలుపే లక్ష్యంగా పనిచేసి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వారికి సూచించారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి తన అండదండలు ఎప్పుడు ఉంటాయి అన్నారు. అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ లతోపాటు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను గ్రామాల్లో ఇంటింటికి చేరవేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love