యువత క్రీడల్లో రాణించాలి

నవతెలంగాణ-ఐడిఎ బొల్లారం
యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని రాష్ట్ర కార్మిక నాయకులు వి.వరప్రసాద్‌ రెడ్డి అన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ నగర్‌ కాలనీకి చెందిన యువకు లకు వి.వి.ఆర్‌ ఫౌండేషన్‌ తరఫున వాలీబాల్‌ కిట్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల పట్ల మక్కువ పెంపొందించుకోవాలని సూచించారు. రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించి ప్రతిభ చాటాలని పిలుపునిచ్చారు. క్రీడా పరికరాలు అందజేసిన నాయకులకు కాలనీ యువకులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు జె.జె సింగ్‌, సతీష్‌, సురేష్‌, సంతోష్‌, జీవరత్నం, నవీన్‌, వినోద్‌, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Spread the love