14 ఏండ్ల బాధలకు విముఖ్తి
ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్
నవ తెలంగాణ – మల్హర్ రావు.
తాడిచెర్ల టిఎస్ జెన్కో ఉపరితల బొగ్గుగని డేంజర్ జోన్లోని నివాసులు బ్లాస్టింగ్ వలన నిర్వశితుల ఇల్లు బీటలు రడం,కూలిపోవడం,దుమ్ము,ధులి,బావుల్లో,బోరులల్లో నీరు అడుగంటి పోవడంతో పాటు,డేంజర్ జోన్ లోని ప్రజలు ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందులుపదుతున్న నేపథ్యంలో నివాస గృహాలను సేకరించి నష్టపరిహారం చెల్లించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని 2014 సంవత్సరం నుండి నిర్వశితులు అనేక దీక్షలు,ధర్నాలు,వంటా వార్పులు,కేసులపాలై ఎన్నో పోరాటాలు చేసిన కూడా గత టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వశితులను పట్టించుకున్న పాపనపోలేదని ఈజిసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్,భూ నిర్వాసితులు వాపోయారు.
2023 ఎన్నికల్లో శ్రీధర్ బాబు తాడిచెర్ల డేంజర్ జోన్ పరిధిలోని ప్రజలకు మాటిచ్చి ఇచ్చిన మాట ప్రకారం తాడిచెర్ల డేంజర్ జోన్ పరిధిలోని నిజమైన నిర్వశితుల నివాస గృహాల సేకరణ కోసం జెన్కో వాళ్ళతో మాట్లాడి రూ.261 కోట్ల నిధులు జెన్కో నుండి జిల్లా కలెక్టర్ ఖాతాలో జమచేయించడం జరిగిందన్నారు. ఇందుకు తాడిచెర్ల – కాపురం భూనిర్వశితుల కమిటీ ఆధ్వర్యంలో డేంజర్ జోన్ నిర్వశితులు సంతోషంతో దుద్దిళ్ల శ్రీధర్ బాబు డేంజర్ జోన్ పరిధిలోని అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున కలిసి డి జె పాటలతో మహిళల నృత్యాలతో భారీ “కృతజ్ఞత ర్యాలీ” నిర్వహించి శ్రీధర్ బాబు ఫొటోకు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకోవడం జరిగిందని తెలిపారు.ఇందులో భాగంగా శ్రీధర్ బాబు 57వ జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామంలో గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు , యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేకు కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు .ప్రజల పట్ల ఆయనకున్న అంకితభావం, అభివృద్ధి పట్ల ఉన్న దృఢ సంకల్పం, నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కృషిని కొనియాడారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుని,వాటి పరిష్కారానికి ప్రభుత్వ స్థాయిలో నిరంతరం కృషి చేస్తూ, అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా పనిచేస్తున్న ప్రజా నాయకుడిగా ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారన్నారు.ఆయన మరిన్ని సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి విశిష్ట సేవలు అందించాలని, వారు ఆయురారోగ్యాలు,అష్టస్వైర్యలు సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. ఈకార్యక్రమంలో తాడిచెర్ల టిఎస్ జెన్కో భూనిర్వశితుల కమిటీ, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, డేంజర్ జోన్ నిర్వశితులు, గ్రామ సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజయ్య, తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొండియ్య, కాంగ్రెస్ నాయకులు కేసారపు చంద్రయ్య, జిల్లా కార్యదర్శి ఇందారపు చంద్రయ్య, సర్పంచ్లు రాజమ్మ, మేకలవరాజయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఐత రాజీ రెడ్డి, జంపయ్య నాయక్, అధిక సంఖ్యలో మహిళలు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
మంత్రి శ్రీధర్ బాబుకి కృతజ్ఞతలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



