సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను కలిసిన వైఎస్ షర్మిల

నవతెలంగాణ – ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెప్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలను కలిశారు. ఈ భేటీ సోనియా నివాసంలో జరిగింది. ఈ సమావేశంపై షర్మిల ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తదుపరి కార్యాచరణకు సంబంధించి ఆసక్తికరమైన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా… భవిష్యత్ ప్రణాళికలు, కార్యాచరణ తీరుతెన్నులు, ఇతర అంశాలపై నిర్మాణాత్మకమైన చర్చ జరిగింది. రాబోయే రోజుల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునర్ వైభవం సంపాదించుకోవడమే కాదు ఒక బలీయమైన శక్తిగా అవతరిస్తుందని అన్నారు.

Spread the love