భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలోని నర్సరీని జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి గురువారం సందర్శించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామంలో చేపడుతున్న నర్సరీ మొక్కలను పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేసి, ఏడు రకాల రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పంచాయతీ రాజ్ ఏ ఈ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి దాసరి పద్మారెడ్డి లు పాల్గొన్నారు.