
జిల్లా ప్రజా పరిషత్తు కార్యాలయంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ఆధ్వర్యం లో రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయిన జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారి సిహెచ్ కృష్ణా రెడ్డి, నల్గొండ జిల్లాకు బదిలీ అయిన ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి శ్రీనివాస్ రావులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్తు వైస్ చైర్మన్ ధనావత్ బికు నాయక్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఎన్ శోభారాణి , ఉపముఖ్య కార్యనిర్వాహణాధికారి డి విష్ణువర్ధన్ రెడ్డి, జడ్పిటిసిలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు