జెడ్పీ చైర్మెన్‌ లింగాల కమల్‌ రాజుకు మాతృ వియోగం

– ప్రముఖుల నివాళి
నవతెలంగాణ-వైరా
ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ లింగాల కమల్‌ రాజు మాతృమూర్తి లింగాల కరుణమ్మ ఆదివారం మధ్యాహ్నం అనారోగ్యంతో మరణించారు. ఆమె పార్థివ దేహాన్ని కమల్‌ రాజు స్వగ్రామం వైరా మండలం కోస్టాల గ్రామం లో ఉంచారు. కరుణమ్మ మరణ వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్‌ ఆ గ్రామానికి వెళ్లి నివాళులర్పించారు. కమల్‌ రాజు, అతని సోదరుడు రవికుమార్‌కు సానుభూతి తెలిపారు. ఆమెకు భర్త జ్ఞాన రత్నం, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అంత్య క్రియలు సోమవారం ఉదయం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
లింగాల కరుణమ్మకు ప్రముఖుల నివాళి
ఎంపి నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే ఎల్‌ రాములు నాయక్‌, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే బి.మదన్‌ లాల్‌, రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు వైరా మండలం కొస్టాల గ్రామం వెళ్లి కరుణమ్మ పార్థివ దేహంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. చైర్మన్‌ కమల్‌ రాజు తో పాటు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
కరుణమ్మ మృతికి వద్దిరాజు సంతాపం
ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి: ఖమ్మం జిల్లా ప్రజాపరిషత్‌ ఛైర్మన్‌ లింగాల కమల్‌ రాజు మాతృమూర్తి కరుణమ్మ మృతికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆదివారం ఫోన్‌ లో సంతాపం వ్యక్తం చేశారు. కరుణమ్మ మృతి వార్త తెలిసిన వెంటనే ఎంపీ రవిచంద్ర ఫోన్‌ చేసి కమల్‌ రాజ్‌ ను పరామర్శించారు. తీవ్ర విచారం వెలిబుచ్చారు. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
ముదిగొండ మండల బీఆర్‌ఎస్‌ శాఖ నివాళి
ముదిగొండ: జెడ్పీ చైర్మెన్‌ లింగాల కమల్‌ రాజు మాతృమూర్తి కరుణమ్మ మృతదేహానికి బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, మేడిపల్లి సొసైటీ చైర్మన్‌ సామినేని వెంకటేశ్వరరావు, మండల నాయకులు బంక మల్లయ్య, తదితరులు నివాళి అర్పించారు.

Spread the love