ఆర్‌బీఐ ఆరోసారీ…

– రెపోరేటు పావు శాతం పెంపు
– గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మరింత భారం
ముంబయి : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వరుసగా ఆరోసారి వడ్డీ రేటు బాదుడును కొనసాగించింది. రెపోరేటును మరో పావు శాతం లేదా 25 బేసిస్‌ పాయింట్లు పెంచి 6.50 శాతానికి చేర్చింది. తాజాగా ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన మూడు రోజుల పాటు సాగిన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) విధాన సమీక్ష బుధవారం ముగిసింది. తాజా పెంపునతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మరింత ప్రియం కానున్నాయి.గతేడాది మే నుంచి రెపోరేటును 250 బేసిస్‌ పాయింట్లు పెంచింది. చమురు ధరలు, భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా భారత భవిష్యత్‌ అంచనాలు అస్పష్టం గానే ఉన్నాయని శక్తికాంత దాస్‌ అన్నారు. ప్రజలు ఇకపై నాణేలు సులభంగా పొందేందుకు వీలుగా ప్రయోగాత్మక ప్రాజెక్టు కింద 12 నగరాల్లో కాయిన్‌ వెండింగ్‌ మిషన్లను ఏర్పాటు చేయనున్నామన్నారు.
ఆర్‌బీఐ ఎంపీసీలో నిర్ణయాలు…

గతేడాది మే నుంచి ఇప్పటి వరకు 250 బేసిస్‌ పాయింట్లు లేదా 2.50 శాతం పెంచినట్లయ్యింది. భేటీ వివరాలను శక్తికాంత దాస్‌ మీడియాకు వెల్ల డించారు.. ఆ అంశాలు. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ అయినా రిటైల్‌ ఈ-రూపీ ప్రయో గాలను మరిన్ని నగరాలకు విస్తరించనున్నారు. ఈ ప్రక్రియ లో మరిన్ని బ్యాంకులకు భాగస్వామ్యం కల్పించనున్నామని శక్తికాంత దాస్‌ తెలిపారు. ఈ-రూపి సేవలను మరో 5 బ్యాంకులు, 9 నగరాలకు విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.
టోకు అవసరాలకు సంబంధించిన ఈ-రూపీ ప్రయోగాలను గతేడాది నవంబర్‌ 1న, రిటైల్‌ అవసరాలకు సంబంధించిన ఈ-రూపీని డిసెంబర్‌ 1న ఆర్‌బీఐ ప్రారంభిం చింది. ప్రస్తుతం రిటైల్‌ ఈ-రూపీని ప్రయోగాత్మ కంగా 50 వేలమంది వినియోగదారులు, 5 వేల మంది వ్యాపారులు వినియోగిస్తున్నారని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ టి రవి శంకర్‌ తెలిపారు. ఈ- రూపీ కరెన్సీ వినియోగంలో ఎలాంటి అవరోధాలూ తలెత్తకూడదన్న ఉద్దేశంతో నెమ్మదిగా ఈ విధానాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించామన్నా రు. గౌతం అదానీపై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన రిపోర్ట్‌పై శక్తికాంత దాస్‌ స్పందించారు. వ్యక్తిగత సంఘటన లేదా ఓ కేసు ద్వారా బ్యాంకులు ప్రభావితం అయ్యే అవకాశం లేదన్నారు. భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ బలంగా ఉన్న దని, మరింత బలోపేతం చేసుకునేం దుకే చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రత్యేకమైన పరిస్థితులు ద్రవ్యపరపతి విధానాన్ని సవాలుగా మార్చేశాయని శక్తికాంత దాస్‌ అన్నారు. ద్రవ్యోల్బణం విషయంలో ద్రవ్య పరపతి విధాన కమిటీ అప్రమత్తంగానే ఉందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2023-24లో ద్రవ్యోల్బణం 4 శాతం లక్ష్యం కంటే ఎక్కువగానే ఉండొచ్చన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ పెరుగుదల 6.5 శాతా నికి మందగించవచ్చన్నారు. వచ్చే 2023-24లో ఇది 6.4 శాతానికి తగ్గొచ్చన్నారు. 2021-22లో 8.7 శాతం వృద్థి నమోదయిన విషయం తెలిసిందే.

Spread the love