ఇన్‌స్టాలోనూ అదరగొట్టిన మెస్సీ

– 6.8కోట్ల లైక్‌లతో నయా రికార్డు
న్యూఢిల్లీ: ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అర్జెంటీనా కెప్టెన్‌ లియోనెల్‌ మెస్సీ రికార్డులు తిరగరాస్తున్నాడు. ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఫోటోలను మెస్సీ ఓ గ్యాలరీగా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్టు చేశాడు. ఇప్పటికే ఆ గ్యాలరీ 6.8 కోట్ల లైక్‌లు వచ్చేశాయి. ఆ గ్యాలరీలో కప్‌ గెలిచిన తర్వాత ఎంజారు చేస్తున్న అర్జెంటీనా టీమ్‌ ఫోటోలు ఉన్నాయి. గతంలో ఇన్‌స్టాలో అత్యధిక లైక్‌లు వచ్చిన పోస్టు బ్రౌన్‌ ఎగ్‌. 2019లో ఆ పోస్టు చేశారు. ఆ ఎగ్‌ పోస్టుకు సుమారు 5.7కోట్ల లైక్‌లు వచ్చాయి. తాజాగా ఆ రికార్డును మెస్సీ బ్రేక్‌ చేసి ఆల్‌టైమ్‌ రికార్డు నమోదు చేశాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ జట్టుపై షూటౌట్‌లో అర్జెంటీనా నెగ్గిన విషయం తెలిసిందే. ఫైనల్లో మెస్సీ రెండు గోల్స్‌ చేశాడు. బెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీకి ఇచ్చే గోల్డెన్‌ బాల్‌ను మెస్సీ గెలుచుకున్నాడు.

Spread the love