భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది.
2024 సంవత్సరంలో విడుదలైన వైవిధ్య భరితమైన చిత్రాలకు, ఉత్తమ ప్రతిభ కనబర్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ అవార్డులను అందజేయనుంది.
ప్రముఖ సౌత్ ఫిల్మ్ మేకర్ జయరాజ్ జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరించిన ఈ అవార్డ్స్‌లో జాతీయ ఉత్తమ చిత్రంగా ‘ఆర్టికల్ 370ఎంపికవ్వగా, మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్ జాతీయ ఉత్తమ నటులుగా, యామీ గౌతమ్ ఉత్తమ నటిగా పురస్కారాలను కైవసం చేసుకున్నారు. 'అమరన్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి జాతీయ ఉత్తమ దర్శకుడిగా పురస్కారాన్ని దక్కించుకున్నారు.
గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఏకంగా 9 అవార్డులతో తెలుగు సినిమా విజయకేతనాన్ని ఎగురవేయటం వివేషం.
బ్లాక్ అండ్ వైట్‌లో సినిమా, పైగా అందులో అగ్ర హీరో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించడం వంటి సాహస ప్రయోగాత్మక చిత్రం ‘భ్రమయుగం’కు జాతీయ అవార్డుల జ్యూరీ కమిటీ ఫిదా అయ్యింది. కొడుమన్ పొట్టి అనే ఓ మిస్టీరియస్ క్యారెక్టర్‌లో మమ్ముట్టి తన నట విశ్వరూపం చూపించారు.
భారత్‌కు చెందిన మొట్టమొదటి పారా ఒలిం పిక్స్ గోల్డ్ మెడలిస్ట్ మురళీకాంత్ పేట్కర్ జీవి తం ఆధారంగా తెరకెక్కిన ‘చందూ ఛాంపి యన్’ సినిమాలో చందూ అనే యువకుడిగా కార్తిక్ ఆర్యన్ మెప్పించి, అవార్డును కైవసం చేసుకున్నారు. ‘ఆర్టికల్ 360`లో ఎన్‌ఐఏ అధికారిణి జూనీ హక్సర్‌గా శక్తిమంతమైన పాత్రలో నటించిన యామి గౌతమి తొలిసారి జాతీయ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.
తెలుగు సినిమాకు జాతీయ అవార్డుల పంట
72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో మరోసారి తెలుగు సినిమాలు అదరగొట్టాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కమిటీ కుర్రోళ్ళు’ ఎంపికైంది. అలాగే, ఉత్తమ మేకప్ విభాగంలోనూ అవార్డు దక్కించుకుంది.
కొత్త నటీనటులతో దర్శకుడు యదు వంశీ రూపొందించిన ఈ చిత్రానికి నిహారిక కొణిదెల నిర్మాత. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లోనూ జాతీయ సమైక్యత, మతసామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతికి ఉద్దేశించిన చిత్రంగా వివిధ విభాగాల్లో పురస్కారాలను కైవసం చేసుకుంది. ఇక నాగ్ అశ్విన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 ఏడీ’ రెండు కేటగిరీల్లో అవార్డులను దక్కించుకుంది. అద్భుత మైన సెట్స్, విజువల్స్‌తో అలరించినందుకు ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అవార్డుతో పాటు, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది.
‘ఒక్క రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు గడవలేదు. దానికి జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా’ వంటి సంభాషణలతో అలరించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఇలాంటి అద్భుతమైన సంభాషణలను రాసి జీవిత సత్యాలెన్నో చెప్పిన దర్శకుడు వెంకీ అట్లూరి ఉత్తమ రచయితగా (సంభాషణలు) జాతీయ అవార్డు దక్కింది.
మాస్‌నే కాదు, బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేసిన చిత్రం ‘పుష్ప2’. ఈ సినిమా సైతం రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. దర్శకుడు సుకుమార్ ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత (ఒరిజినల్) కేటగిరిలో అవార్డుకు ఎంపిక కాగా, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా దీపాలి నూర్, సీతల్ శర్మలకు అవార్డు దక్కింది. చిన్న చిత్రం కాదు.. ప్రతి ఒక్కరి మనుసుల్ని హత్తుకునేంత పెద్ద చిత్రమనించింది ‘35- చిన్న కథ కాదు`. జాతీయ అవార్డుల్లో ఉత్తమ బాలల చిత్రంతో పాటు, ఉత్తమ బాల నటుడిగా అరుణ్‌దేవ్ పోతుల అవార్డుకు ఎంపికయ్యారు.
మొత్తంగా మరోసారి తెలుగుసారి సత్తా చాటడం విశేషం.
బీజేపీ అనుకూల చిత్రాలకు పెద్దపీట
ఈసారి బీజేపీ అనుకూల చిత్రాలకు జ్యూరీ పెద్ద పీట వేసిందనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి.
జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిం చిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించే నేపథ్యంలో రూపొందిన ‘ఆర్టికల్ 370’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. బీజేపీ తరచూ ప్రస్తావించే వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ‘స్వాతంత్ర వీర్ సావర్కర్’ దర్శకుడు రణదీప్ హుడాకి ఉత్తమ తొలి దర్శకుడు పురస్కారం లభించింది. సనాతన భావ జాలానికి ప్రచారం కల్పించిన చిత్రాలకు, అలాగే ప్రస్తుత బీజేసీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఆ పార్టీ ప్రోత్సహిస్తున్న చారి త్రక, రాజకీయ ప్రచారానికి అనుగుణం గా రూపొందిన చిత్రాలకు అవార్డు లొచ్చాయని విమర్శలొస్తున్నాయి.
72వ జాతీయ చలన చిత్ర విజేతలు
ఉత్తమ నటుడు: కార్తిక్ ఆర్యన్ (చందూ ఛాంపియన్)
ఉత్తమ నటుడు: మమ్ముట్టి (భ్రమయుగం)
ఉత్తమ నటి: యామి గౌతమ్ (ఆర్టికల్ 370)
ఉత్తమ చిత్రం: ఆర్టికల్ 370 (ఆదిత్య సుహాస్ జంబాలే)
ఉత్తమ దర్శకత్వం: అమరన్ (రాజ్‌కుమార్ పెరియసామి) ఉత్తమ సహాయ నటి: మిథ్య (రూపశ్రీ వర్కాడే)
ఉత్తమ సహాయ నటి: సచన నమిదాస్ (మహారాజ)
ఉత్తమ సహాయ నటుడు: సంజయ్ మిశ్రా (భక్షక్)
ఉత్తమ బాలల చిత్రం: చిన్న కథ కాదు
(దర్శకుడు-నంద కిషోర్)
ఉత్తమ జాతీయ, విలువల చిత్రం:
కెప్టెన్ మిల్లర్ (దర్శకుడు- అరుణ్ మాథేశ్వరన్)
ఉత్తమ ప్రజాదరణ చిత్రం:
కల్కి 2898 ఏడీ (నాగ్ అశ్విన్)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: రణ్‌దీప్ హుడా
(స్వాతంత్ర్య వీర్ సావర్కర్)
ఉత్తమ యాక్షన్: మహారాజ (తమిళ్)
ఉత్తమ కొరియోగ్రఫ్రీ: విజయ్ గంగూలీ
(ఆజ్ కిరాత్ -స్త్రీ2)
ఉత్తమ గేయరచన: మనోజ్ ముంతాషిర్
(జానేదో-మైదాన్)
ఉత్తమ సంగీతం (నేపథ్యం):
జీవీ ప్రకాశ్ కుమార్ (అమరన్)
ఉత్తమ సంగీతం (సాంగ్స్) :
శశ్వాంత్ సచ్‌దేవ్ (ఆర్టికల్ 370)
ఉత్తమ మేకప్: పి. రవికుమార్ (కమిటీ కుర్రోళ్ళు)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్:
దీపాలి నూర్, సీతల్ శర్మ (పుష్ప2)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్:
నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ ఎడిటింగ్: ఆర్ కలైవానన్ (అమరన్)
ఉత్తమ సౌండ్ డిజైన్: మానస్ చౌదరి
(భూల్ భూలయ్య 3-హిందీ)
ఉత్తమ స్క్రీన్‌ప్లే (సంభాషణలు):
వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత (అడాప్టెడ్):
యోగేశ్ దేశ్‌పాండే (స్వరగంధర్వ సుదిర్ ఫాడ్కే)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత (ఒరిజినల్):
సుకుమార్ (పుష్ప2)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: షెహనాద్ జలాల్ (భ్రమయుగం)
ఉత్తమ గాయని: వైకోమ్ విజయలక్ష్మీ (ఏఆర్‌ఎం)
ఉత్తమ గాయకుడు: అభయ్ జోథ్ పూర్కర్
ఉత్తమ బాల నటులు: రిద్ధిమాన్ బెనర్జీ, తపోమయ్ దేవ్, గీతాశ్రీ చక్రవర్తి (ఆంకో కి కితిన్ -బెంగాలీ)
ఉత్తమ బాల నటుడు : అరుణ్‌దేవ్ పోతుల
(35 – చిన్న కథ కాదు)
ఉత్తమ బాల నటుడు: అతిశ్ శెట్టి
జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు
ఉత్తమ తుళు ఫిల్మ్: ఇంబు
ఉత్తమ గర్వాలీ ఫిల్మ్: ధోలి
ఉత్తమ తెలుగు ఫిల్మ్: కమిటీ కుర్రోళ్ళు
ఉత్తమ తమిళ్ ఫిల్మ్: రాయన్
ఉత్తమ ఒడియా ఫిల్మ్: లహరి: ది టైడ్ ఆఫ్ టైమ్
ఉత్తమ మరాఠీ ఫిల్మ్: ముక్కమ్ పోస్ట్ బొంబిల్ వాడి
ఉత్తమ మణిపురి ఫిల్మ్: సునిత
ఉత్తమ మలయాళం ఫిల్మ్: ఫెమినిచ్చి ఫాతిమా
ఉత్తమ కొంకణి ఫిల్మ్: మోగోసమ్
ఉత్తమ కన్నడ ఫిల్మ్: మిథ్య
ఉత్తమ హిందీ ఫిల్మ్: శ్రీకాంత్
ఉత్తమ గుజరాతీ ఫిల్మ్: మారన్
ఉత్తమ బెంగాలీ ఫిల్మ్: చలిచిత్ర ఎకోన్
ఉత్తమ అస్సామీ ఫిల్మ్: జుయ్‌ఫుల్ (ఆరెంజ్ అండ్ పర్పుల్)
జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో మరోసారి సత్తా చాటిన తెలుగు సినిమా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



