Sunday, July 19, 2026
E-PAPER
Homeఆటలుజపాన్‌ ఓపెన్‌ ‌బ్యాడ్మింటన్‌ ‌టోర్నీ ఫైనల్‌‌కు సింధు

జపాన్‌ ఓపెన్‌ ‌బ్యాడ్మింటన్‌ ‌టోర్నీ ఫైనల్‌‌కు సింధు

- Advertisement -

సెమీస్‌‌లో 4వ సీడ్‌ చెన్‌
టోక్యో:
జపాన్‌ ఓపెన్‌ ‌బ్యాడ్మింటన్‌ ‌టోర్నీ మహిళల సింగిల్స్‌ ‌ఫైనల్లోకి పివి సింధు ప్రవేశించింది. శనివారం జరిగిన తొలి సెమీఫైనల్లో సింధు తొలి సెట్‌‌ను గెలిచి రెండో సెట్‌‌లోనూ ఆధిక్యతలో ఉన్న దశలో 4వ సీడ్‌, చెన్‌ ‌యూఫీ(చైనా) గాయం కారణంగా వైదొలిగింది. తొలి సెట్‌‌లో హోరాహోరీగా తలపడిన సింధు.. ఒక దశలో ఇరువురు 19-19తో సమంగా ఉన్నారు. ఆ దశలో సింధు వరుసగా వరుసగా రెండు పాయింట్లు సాధించి 21-19తో ఆ గేమ్‌ను కైవసం చేసుకుంది. తొలి గేమ్‌‌ను చే‌జిక్కించుకున్న ఉత్సాహంతో రెండో గేమ్‌‌లోనూ సింధు ధాటిగా ఆడింది. అదే ఊపులో రెండో సెట్‌‌లోనూ 15-10తో ఆధిక్యతలో ఉన్న దశలో చైనా షట్లర్‌ ‌చెన్‌ ‌యూఫీ భుజం నొప్పి కారణంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో 18వ ర్యాంక్‌‌కు పడిపోయిన సింధు.. ఆ తర్వాత వరుస టోర్నీలో ఆడుతూ ప్రస్తుతం 9వ ర్యాంక్‌‌లో నిలిచి టాప్‌-10‌లో చోటు దక్కించుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో జపాన్‌‌కు చెందిన టాప్‌‌సీడ్‌, అకానే యమగుచితో తలపడనుంది. ‌యూఫీపై గెలుపు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -