జూమ్‌ ప్రెసిడెంట్‌కు ఉద్వాసన

వాషింగ్టన్‌ : టెక్‌ కంపెనీల్లో ఇటీవల క్రింది నుంచి పై స్థాయి వరకు వేలాది ఉద్యోగుల తొలగింపులను చూస్తున్నాము. కానీ.. ఈ సారి ఏకంగా ఓ టెక్‌ దిగ్గజం ప్రెసిడెంట్‌ పదవికే ఎసరు రావడం విశేషం. ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్‌ సంస్థ ‘జూమ్‌’ ఎలాంటి కారణం లేకుండానే ఆ కంపెనీ ప్రెసిడెంట్‌ గ్రెగ్‌ టొంబ్‌కు ఉద్వాసన పలికింది. సేల్స్‌ ఆపరేషన్స్‌, ఎర్నింగ్స్‌ కాల్స్‌లో కీలక పాత్ర పోశించిన గ్రెగ్‌ను శుక్రవారం ఆ కంపెనీ తొలగించినట్లు రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. సంస్థ తరుపు నుంచి అన్నీ ప్రయోజనాలకు కల్పిస్తూ.. ఎలాంటి కారణం లేకుండానే తొలగించామని ఆ సంస్థ పేర్కొనడం విశేషం. ఫిబ్రవరిలో ఈ కంపెనీ తన 15 శాతానికి సమానమయ్యే 1300 మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. వైదొలగనున్న టొంబ్‌కు 45 మిలియన్ల విలువైన కంపెనీ స్టాక్స్‌తో పాటు 4లక్షల బిలియన్‌ డాలర్ల వేతనాన్ని చెల్లించనుంది. టొంబ్‌ స్థానంలో కొత్త వారిని నియమించనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది.

Spread the love