దీపపై 21 నెలల నిషేధం

– నిషేధిత ఉత్పేరకంపై వాడా చర్య
న్యూఢిల్లీ: భారత స్టార్‌ జిమ్నాస్ట్‌ దీప కర్మాకర్‌ 21 నెలల నిషేధం ఎదుర్కొంటుంది. వాడా నిషేధిత జాబితాలోని ఉత్పేరకం దీప కర్మాకర్‌ శాంపిల్‌లో కనిపించింది. అవగాహన లోపం, తెలియకుండానే ఔషధం రూపంలో నిషేధిత ఉత్పేరకం తీసుకున్నట్టు దీప కర్మాకర్‌ అంతర్జాతీయ జిమ్నాస్టిక్స్‌ సమాఖ్యతో తెలిపింది. దీప కర్మాకర్‌ వాంగూల్మం అనంతరం మూడు నెలల నిషేధం కుదించిన వాడా.. రెండున్నర నెలల ముందు నుంచే నిషేధం అమలు చేసింది. అక్టోబర్‌ 2021 నుంచి నిషేధం అమల్లో ఉండగా..ఈ ఏడాది జులైలో ముగియనుంది. 2017లో ఏసీఎల్‌ గాయంతో జిమ్నాస్టిక్స్‌కు దూరమైన దీప కర్మాకర్‌.. 2016 రియో ఒలింపిక్స్‌లో తృటిలో పతకం చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జులైలో పునరాగమనం కోసం సిద్ధమవుతున్నట్టు దీప కర్మాకర్‌ వెల్లడించింది.

Spread the love