కేటీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి..

– నేడు జరుగు కలెక్టరేట్ వద్ద ధర్నాను విజయవంతం చేయండి
– కల్లుగీత కార్మిక సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు పులి నర్సయ్య గౌడ్
నవతెలంగాణ- తాడ్వాయి
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్ గీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు పులి నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం కాటా పూర్ లోని తాటి వనంలో ని ఎల్లమ్మ ఆలయం వద్ద గీత కార్మికులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గీత కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలపై, కేటీఆర్ ఇచ్చిన గీత కార్మికులకు హామీలు అమలు చేయాలని నేడు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరుగు మహా ధర్నాను గీత కార్మికులందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కల్లుగీత కార్మికుల సొసైటీలో సభ్యులందరికీ మోటార్ బైకులు సేఫ్టీ మోకులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కులవృత్తిదారులకు ప్రభుత్వం ఇస్తామన్న లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయాలని, సొసైటీలకు భూమి కల్లుకు మార్కెట్ నీర తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలకు ప్రభుత్వం 5 వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలన్నారు. నేడు జూలై 10 నా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు వేలాది మంది గీత కార్మికుల అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాటాపూర్ సొసైటీ గీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love