ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటకలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మైసూర్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో చిన్నారితో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కొల్లేగాల, టి.నరసీపూర్ ప్రధాన రహదారిపై కురుబూరు గ్రామం పింజర పోల్ వద్ద ప్రైవేట్ బస్సు, ఇన్నోవా కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇన్నోవాకారు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మార్గం మధ్యలో మరణించారు. మృతుల్లో పది మంది బళ్లారికి చెందిన వారని తెలిసింది. టి.నరసీపూర్ ప్రధాన రహదారిపై వెళ్తున్న ఇన్నోవా కారు డ్రైవర్ నియంత్రణ తప్పి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును ఢీకొట్టినట్లు చెబుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలంలో ప్రమాద చిత్రాలు భయంకరంగా ఉన్నాయి. నుజ్జునుజ్జైన కారులోనే మృతదేహాలు చిక్కుకుపోయాయి. చాలా సమయం తర్వాత వీటిని బయటకు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Spread the love