వేల్పు జాతరలు 100 కోట్లు కేటాయించాలి

– తుడుందేబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి
నవతెలంగాణ -తాడ్వాయి : వేల్పు ల జాతరకు 100 కోట్లు కేటాయించాలని కుమార్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కొరగట్ల లక్ష్మణ్ రావు అధ్యక్షతన మేడారం జాతర అంశం పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు మైపతి అరుణ్ కుమార్, ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల.రవి  మాట్లాడుతూ మేడారం జాతర నిర్వహణ కోసం వేసే ట్రస్టు బోర్డు కమిటీ నీ త్వరితి గతిన ఏర్పాటు చేయాలని, దానితో పాటు ఈ కమిటీ నీ కేవలం మేడారం జాతర నిర్వహణ కోసం కాకుండా గోదావరి పరివాహక ప్రాంతం లో ఉన్న కోయ నాయకపోడు వేల్పు జాతర ల నిర్వహణ అభివృధి చేసే బోర్డ్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
గోదావరి పరివాహక ప్రాంతం లో 205  కోయ వేల్పు జాతరలు ఉన్నాయని, స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుండి నేటికీ 76 ఏళ్లు దాటిన ఇంకా అవి ఇప్ప చెట్ల కింద పూరి గుడిసెల్లో నే మగ్గుతున్నయని అన్నారు. కనీసం వాటికి పూజ సామగ్రి కి సరిపడా పైసలు లేక చాలా జాతరలు అన్య మతం ముసుగులో కను మరుగు అయ్యాయని వాపోయారు. ఆదివాసి సంస్కృతి నీ ప్రభుత్వాలు నిర్లక్యం చేయటం వలన ఆదివాసీలు హిందూ,క్రైస్తవ,ముస్లిం లాంటి మతాలలోకి వెళ్లి పోతున్నారని దీనివలన జాతి అంతరించే ప్రమాదాలు ఉన్నాయని అన్నారు. ప్రతి వేల్పు జాతరకు 20 లక్షల రూపాయల చొప్పున కేటాయించి అభివృధి చేయాలని అన్నారు. ప్రభుత్వాలు హిందూ క్రైస్తవ మతాల రక్షణకు ఇచ్చిన విలువ ఆదివాసి సంస్కృతి రక్షణకు ఇవ్వటం లేదు అన్నారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తె మేడారం జాతరకు 200 కోట్లు కేటాయిస్తామని హామీ ఇవ్వటం జరిగింది అని కానీ 75 కోట్లు మాత్రమే కేటాయించింది అని అందుకు గాను ఇచ్చిన మాట ప్రకారం ఈ యేడాది  పిబ్రవరి నుండి జూలై వరకు జరిగే ఆదివాసి జాతరలు కు ప్రతి జాతరకు ముందస్తుగా 20 లక్షలు కేటాయించాలని అన్నారు. ఆ దిశ గా ప్రభుత్వం ఆలోచన చేసి ట్రస్టు బోర్డ్ నిర్మాణం చేయాలని దానిలో ప్రాంతాల వారీగా మెగా బోర్డ్ 30 మంది తో ఏర్పాటు చేసేలా చర్యలు చేయాలని అన్నారు. ఈ  కార్యక్రమం లో తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంజ నారాయణ, ప్రచార కార్యదర్శి అన్నే బోయిన సమ్మయ్య, మండల అధ్యక్షులు మోకాళ్ళ వెంకటేష్, ప్రధాన కార్యదర్శి యలం.విక్రమ్, ఉపాధ్యక్షులు వట్టం లక్ష్మినారాయణ, తాటి మహేష్ తదితరులు పాల్గొంన్నారు.
Spread the love