ఆకినపల్లి రమేష్ బిఆర్ఎస్ అధ్యక్షుడు..

నవ తెలంగాణ-గోవిందరావుపేట: ప్రతి ఒక్కరు కారు గుర్తులు బాగా గుర్తుంచుకొని ఓటు వేసి గెలిపించాలని గోవిందరావుపేట బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆకినపల్లి రమేష్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం రమేష్ ఆధ్వర్యంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ ఆదరణ లభిస్తుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు అందుకొని కుటుంబం లేదని ప్రచారంలో ప్రతి కుటుంబం రుణమాఫీ వచ్చిందని రైతుబంధు వచ్చిందని పెన్షన్ వస్తుందని కేసిఆర్  రుణపడి ఉంటామని చెబుతున్నారని అన్నారు. గతంలో కంటే ప్రజల్లో పార్టీ పట్ల ఆదరణ పెరిగిందని అన్నారు. ప్రత్యేకించి మహిళలు ఆదరిస్తున్న తీరు చూస్తుంటే 50 వేల పైచిలుకు మెజారిటీతో బడే నాగజ్యోతి గెలవడం ఖాయమని అన్నారు. మండలానికి గతంలో అందరికీ సుపరిచితుడైన బడే నాగేశ్వరరావు కూతురు కావడం కూడా పార్టీకి ఓకింత కలిసి వచ్చిందని అన్నారు. గత జడ్పిటిసి ఎన్నికల్లో ఓటమి ఎరగని అభ్యర్థిగా ముద్రపడిన నాగజ్యోతికి ఈ ఎన్నికలు కచ్చితంగా విజయ అవకాశాన్ని తెచ్చిపెడతాయని అన్నారు. గత పది సంవత్సరాల కాల వ్యవధిలో మండల కేంద్రంలో ఇంత ఆదరణ గతంలో ఏ పార్టీకి ఏ అభ్యర్థికి లేదని మహిళలు ప్రజలు యువకులు యువతుల ఆదరణ ఉందని అన్నారు. గ్రామంలో టీఆర్ఎస్ కు మెజారిటీ కొరకు నాయకత్వం సమిష్టిగా పనిచేస్తుందని ఇది పార్టీకి కలిసి వచ్చే అంశమని అన్నారు. ఇతర పార్టీలకు అవకాశం ఇస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారని అన్నారు. ఇలాంటి లోటు లేకుండా పరిపాలన సాగించిన కేసీఆర్ కే మళ్లీ ఓటు వేస్తామని నీరాటంకంగా ఓటర్లు చెబుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులు మహిళలా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love