డిసెంబర్ లో కరోనాతో 10వేల మంది మరణించారు : డబ్ల్యూహెచ్ఓ

నవతెలంగాణ హైదరాబాద్: ప్రపంచానికి కరోనా (COVID-19) ముప్పు ఇంకా తొలగిపోలేదని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్‌ టెడ్రోస్‌ అథనామ్‌ ఘెబ్రెయెస్ (Tedros Adhanom Ghebreyesus) అన్నారు. ప్రపంచ దేశాల్లో పాక్షికంగా ప్రబలుతున్న కొవిడ్ పెద్ద ముప్పుగా మారిందని చెప్పారు. ఒక్క డిసెంబరు నెలలోనే కరోనా మహమ్మారి వల్ల 10 వేలమందికిపైగా మరణించారని తెలిపారు. క్రిస్మస్ (Christmas) సెలవుల కాలంలో కొవిడ్ జేఎన్.1 వేరియంట్ అధికంగా వ్యాప్తి చెందిందని వెల్లడించారు. దీని ప్రభావం అమెరికా, యూరప్‌ దేశాల్లో అధికంగా ఉందన్నారు.

Spread the love