104 (2) చట్టాన్ని రద్దు చెయ్యాలి

– సీఐటీయూ మేడ్చల్‌ జిల్లా సహాయ కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్‌
నవతెలంగాణ-బాలానగర్‌
భారత న్యాయ సంహిత (బి.ఎన్‌.ఎస్‌) చట్టంను రద్దు చేయాలని కూకట్‌పల్లి సర్కిల్‌ బాలానగర్‌ డివిజన్‌లోని ఐడీపీఎల్‌ చౌరస్తాలో సీఐటీయూ ఆధ్వ ర్యంలో బుధవారం ట్రక్‌, ప్రయివేటు బస్సుల డ్రైవర్లు స్వచ్చందంగా బంద్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మేడ్చల్‌, మల్కాజిగిరి జిల్లా సహాయ కార్యదర్శి ఐలాపురం రాజశేఖర్‌ పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రతి పక్ష పార్టీల ఎంపీలను పార్లమెంట్‌ నుండి సస్పెండ్‌ చేసి అడ్డదారిలో డ్రైవర్‌లను బతికి ఉండగానే చచ్చినట్లుగా నూతన చట్టం తీసుకొచ్చరన్నా రు. ఈ చట్టం ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్లకు 10 ఏండ్లు జైలు శిక్ష, రూ. 7లక్షల నష్టపరిహారం ఇచ్చేలా భారత న్యాయ సంహిత (బి.ఎన్‌.ఎస్‌) చట్టం 104 (2) తెచ్చి డ్రైవర్‌లు డ్రైవింగ్‌ ఉద్యోగాలల్లోకి రాకుండా పొట్టే కొట్టే పద్ధతిని కేంద్ర బీజేపీ ప్రభుత్వం చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శిక్షలతోనే ప్రమాదాలు తప్పుతాయనేది గుడ్డి ఆలోచన అన్నారు. మొదటగా కేంద్ర ప్రభుత్వం రోడ్డు గుంతలు లేకుండా చూడాలని అన్నారు. అంతే కాదు ప్రకతి వైపరీత్యాల వల్ల పొగమంచు ద్వారాకూడా ప్రమాదాలు జరుగుతుంటా యని డ్రైవర్‌లను నష్టపరిచే భారత న్యాయ సంహిత చట్టంను రద్దు చేయాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వంను హెచ్చరించారు. రద్దు చేయని పక్షంలో పోరాటాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమం లో సీఐటీయూ ట్రాన్స్పోర్ట్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు బసగాని ఉమేష్‌ రెడ్డి, డ్రైవర్స్‌ల నాయకులు విష్ణు, మోసిన్‌, శేఖర్‌, నరేష్‌, సత్యం ముదిరాజ్‌, భాస్కర్‌, ముఖేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love