చికెన్‌ షావర్మా తిని 12 మందికి అస్వస్థత

12-people-got-sick-after-eating-chicken-shawarmaనవతెలంగాణ – మహారాష్ట్ర
మహారాష్ట్ర రాజధాని ముంబైలో వీధుల్లో అమ్ముతున్న చికెన్‌ షావర్మా తిని సుమారు 12 మంది అస్వస్థతకు గురయ్యారు. బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తూర్పు గోరేగావ్‌ ప్రాంతంలోని సంతోష్‌ నగర్‌లో శాటిలైట్‌ టవర్‌ వద్ద చికెన్‌ షావర్మా తిని రెండు రోజుల వ్యవధిలో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అందులో తొమ్మిది మంది కోలుకొని డిశ్చార్జ్‌ కాగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణంగానే వీరు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

Spread the love