మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్… ధరల పెంపు

నవతెలంగాణ హైదరాబాద్: హోటల్స్​, బార్స్​లో విక్రయించే మద్యంపై వ్యాట్​ పెంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం.. ఈ నవంబర్​ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు మహా సర్కార్ నోటిఫికేషన్​ను విడుదల చేసింది. మహారాష్ట్రలో లిక్కర్​పై వచ్చే జీఎస్​టీ రాబడి చాలా అధికంగా ఉంటుంది. ఇక ముంబైలోని 3 స్టార్​ కన్నా తక్కువ రేటింగ్​ ఉన్న హోటల్స్​లో మద్యం సేవలపై మరింత ట్యాక్స్​ పెంచాలని అక్కడి యంత్రాంగం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం 5శాతంగా ఉన్న ట్యాక్స్​.. 10-15శాతం వరకు చేరొచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే.. ప్రభుత్వానికి వార్షికంగా రూ. 300 కోట్ల నుంచి రూ. 600కోట్ల వరకు అదనంగా రెవెన్యూ జనరేట్​ అవుతుంది.

Spread the love