మహారాష్ట్ర అతలాకుతలం… రెడ్‌ అలెర్ట్‌ జారీ

నవతెలంగాణ ముంబయి : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. రాజధాని ముంబయితో పాటు పూణె, నాగ్‌పూర్‌, షోలాపూర్‌లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గడిచిన 24 గంటల్లో ముంబయి శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం కూడా ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తోందని అన్నారు. నేడు నగరంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నగరానికి

ముంబయి శివారు ప్రాంతాల్లో భారీ వర్షం
ముంబయి శివారు ప్రాంతాల్లో భారీ వర్షం

చేసినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండి) వెల్లడించింది. దీంతో నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు బృహన్‌ ముంబయి మునిసిపల్‌ కార్పోరేషన్‌ (బిఎంసి) తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని బిఎంసి హెచ్చరించింది. గత 24 గంటల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినల్‌లో 153.5 మి.మీ, బైకుల్లాలో 119 మి.మీ, బాంద్రాలో 106 మి.మీ వర్షపాతం నమోదైనట్లు ఐఎండి అధికారులు తెలిపారు.

Spread the love