కుమ్మిన్స్‌ ఇండియా 650శాతం డివిడెండ్‌

పూణె : డీజిల్‌, గ్యాస్‌ ఇంజిన్లను తయారు చేసే కుమ్మిన్స్‌ ఇండియా తన వాటాదారులకు మెరుగైన డివిడెండ్‌ను ప్రకటించింది. 2022-23కు గాను రూ.2 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్‌పై రూ.13 లేదా 650 శాతం డివిడెండ్‌ను అందించడానికి బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. ఇంతక్రితం ఫిబ్రవరిలో కూడా ఆ సంస్థ రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను అందించింది. 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ సంస్థ 29 శాతం వృద్థితో రూ.1,889 కోట్ల అమ్మకాలు నమోదు చేసింది. నికర లాభాలు 68 శాతం పెరిగి రూ.319 కోట్లకు చేరాయి.

Spread the love