మహారాష్ట్రలో దారుణం

– గిరిజన మహిళపై సామూహిక లైంగికదాడి
– ఒకరి అరెస్టు.. సతారాలో ఘటన
ముంబయి :మధ్యప్రదేశ్‌లో గిరిజనుడిపై బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడు మూత్రవిసర్జన ఘటన మరువక ముందే.. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం పాలిస్తున్న మహారాష్ట్రలో ఘోరం చోటు చేసుకున్నది. ఒక గిరిజన మహిళపై సామూహిక లైంగికదాడి జరిగింది. సతారాలో జరిగిన ఈ ఘటనలో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. గతనెల 19న జరిగిన ఈ ఘటన.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై గిరిజన సంఘాలు, మహిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీ సులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురా లు (26) రారుగడ్‌ జిల్లాలోని సుదగధ్‌కు చెందిన వ్యక్తి. ఆమె తన భర్త, పిల్లలతో కలిసి సతా రాలో నిందితుడైన యజమాని పొలంలో పనికి వెళ్లారు. అయి తే, ఆ సమయంలో యజ మాని ఆ మహిళపై లైంగిక దాడికి తెగబడ్డాడు. ఆయనతో పాటు మరికొందరూ సదరు మహిళపై దారుణానికి పాల్పడ్డారు.
ఘటన సమయంలో నిందితులు దంపతుల ఫోన్లు, ఆధార్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారనీ, వారి పిల్లలనూ బందీలుగా ఉంచారని అధికారులు తెలిపారు. అయితే, చివరకు తమ పిల్లల్లో ఒకరితో ఆ దంపతులు ఆ ఘటనా ప్రదేశం నుంచి తప్పించుకోగలిగారని వివరించారు.
రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందనీ, ఒక గిరిజన మహిళకు ఇంత అన్యాయం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని గిరిజన, మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. నిందితులపై కఠిన చర్యలకు డిమాండ్‌ చేశాయి. రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయాలపై ఉన్న శ్రద్ధ మహిళల భద్రతపై లేదని ఆరోపించాయి.

Spread the love