వాట్సాప్‌ డీపీగా ఔరంగజేబు ఫొటో

–  అలా పెట్టుకున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసిన పోలీసులు
ముంబయి: మొబైల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ అవుట్‌లెట్‌లో పనిచేస్తున్న ఓ యువకుడు తన వాట్సాప్‌ డీపీగా ఔరంగజేబు ఫొటోను పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ ను హిందూ సంస్థ పోలీసులకు సమర్పించింది. దీంతో సదరు వ్యక్తిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సెక్షన్‌ 298, 153 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు విచారణ చేపట్టినట్లు చెప్పారు.

Spread the love