నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
గ్రామపంచాయతీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని మండల పరిషత్ కార్యాలయం ఎదుట చేపట్టిన సమ్మె 20వ రోజుకు చేరుకుంది. మంగళవారం కార్మికులు వర్షంలో సమ్మె కొనసాగించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాల కాపాడేందుకు మురికి కాలువలు తీసే కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దుర్గయ్య మామిడి సంపత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.