తీరానికి కొట్టుకొచ్చిన 250 కేజీల డ్రగ్స్‌

నవతెలంగాణ – ముంబయి: మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో గత వారం రోజుల్లో తీర ప్రాంతాలకు పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు కొట్టుకొచ్చాయి. ఆరు రోజుల్లో 250 కేజీలకు పైగా హశీష్‌ (ఒక రకం డ్రగ్స్‌)ను కస్టమ్స్‌ విభాగం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. ఈనెల 14 నుంచి 19వ తేదీ మధ్య కర్దే, లద్ఘర్‌, కెల్షి, కొల్తారే, మురుద్‌, బురోంది, బోరియా బీచ్‌లు, దభోల్‌ క్రీక్‌ నుంచి ఈ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అఫ్గానిస్థాన్‌ నుంచి ఈ డ్రగ్స్‌ వచ్చినట్లు కస్టమ్స్‌ అధికారులు అనుమానిస్తున్నారు.

Spread the love