త్వరలోనే మహిళలకు నెలకు రూ.2,500..

నవతెలంగాణ-హైదరాబాద్ : మహిళలకు ప్రతి నెలా ₹2,500 సాయం అందించే పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, ₹5లక్షలు అందించే పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేస్తామన్నారు. మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు వచ్చే 5 ఏళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు అందించాలని బ్యాంకులకు లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు. ఎస్‌హెచ్‌జీ బ్యాంకు లింకేజీ వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు.

Spread the love