26 న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం

– యువత జీవితాన్నీ చిదిమేస్తున్న డ్రగ్స్
– ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్-ఇండియా
– అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్
యువత జీవితాన్నీ డ్రగ్స్ చిదిమేస్తున్నాయని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్-ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్ అన్నారు . అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ ఆధ్వర్యంలో మంగళవారం యువత – డ్రగ్స్ అనే అంశంపై ఉచిత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గెలుపు ఓటములను సమంగా చూడడం, భావోద్వేగాల నియంత్రణ, క్రీడాస్ఫూర్తి మొదలైనవి చిన్నప్పటి నుండే ఆటల ద్వారా సాధ్యమవుతుందన్నారు. ఈ రోజుల్లో అవి లేకపోవడం వల్ల మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్నారన్నారు. తల్లి దండ్రులు, సమాజం పిల్లలపై సరైన ప్రేమానురాగాలు చూపకపోవడం వల్లే చెడు అలవాట్లు వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ప్రతి 10 మందిలో ఇద్దరు దానికి పూర్తిగా బానిసలై పోతున్నట్లు, మాదక ద్రవ్యాలను వినియోగించే ప్రతీ ముగ్గురిలో ఒక మహిళ ఉంటున్నట్లు ఈ మధ్యనే భారత గ్రామీణ చైతన్య వేదిక చేసిన సర్వేలో తేల్చి చెప్పిందన్నారు. అలవాటు పడిన వారు స్థిమితంగా ఉండలేరన్నారు. ఊరికే ఉద్రేకపడిపోతూ, దేనిపైనా ద ష్టి నిలపలేరని చెప్పారు.వ్యక్తిగత శుభ్రతపై శ్రద్ధ చూపించరు, మంచి దుస్తులు వేసుకోరని, వేళకు స్నానం చేయరు, మురికిగా కనిపిస్తారు. ఒళ్లు వణుకుతుండటం, మాటలు ముద్ద ముద్దగా రావడం ,అతిగా తినడం లేకుంటే ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ఇటువంటి లక్షణాలున్నవారు డ్రగ్స్‌ మాయలో చిక్కుకున్నట్లేనని చెప్పారు. సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ముందుగా వ్యవస్ధ పునాదులును బలోపేతం చేయాలన్నారు .ఒకవైపు కఠిన చట్టాలను అమలుచేస్తూనే పిల్లలను మాదకద్రవ్యాల బారి నుంచి రక్షించుకొనేందుకు ప్రజాచైతన్య కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.  తల్లి దండ్రులు డ్రులూ సమయాన్ని మీ పిల్లల కోసం వెచ్చించాలన్నారు .వారి బలాబలాలు తెలుసుకోవాలన్నారు . వారికి ఎదురయ్యే ఒత్తిడి, సవాళ్లు ఎదుర్కోవడంలో మార్గనిర్దేశం చేయమని చెప్పారు.మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంచాలన్నారు . మాదకద్రవ్యాల వినియోగం కారణంగా దేశంలో ప్రతిరోజూ 23 మంది మరణిస్తున్నారని చెబుతున్న ఎన్‌సీబీ గణాంకాలు భారతావనిని కలవరపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. కౌన్సెలింగ్‌ ద్వారా తాను చేస్తున్నది తప్పు ఈ ఉచ్చు నుంచి నేను బయట పడాలి అనే సంకల్పం ప్రారంభం అయ్యే విధంగా చూడాలని తెలిపారు. ఇది కనుక పిల్ల వాడిలో మనం రప్పించగలిగితే సగం విజయం సాధించినట్లేనన్నారు. ఔషధం కన్నా కౌన్సెలింగ్‌ కీలకం అని అన్నారు. దీని నుంచి బయట పడేందుకు సెల్ఫ్ హిప్నాటిజం, రిలాక్సేషన్ టెక్నిక్స్ ను ప్రాక్టీస్ చేయించారు. ఈ కార్యక్రమంలో జి. కృష్ణ వేణి,పి.స్వరూపా రాణి, కె.సాయి ప్రభాత్, సైకాలజిస్ట్ నితీష్,తల్లి దండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
– డా.హిప్నో పద్మా కమలాకర్
కౌన్సెలింగ్ సైకో థెరపీస్ట్ హిప్నో థెరపీస్ట్
9390044031

Spread the love