సౌభాగ్యలక్ష్మి పథకంతో పేద మహిళలకు భరోసా ప్రతినెల రూ.3000

– సీఎం కేసీఆర్‌ బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల అభ్యన్నతికి పెద్దపీట
– బీఆర్ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు
– ఈనెల 30 న మీ అమూల్య ఓటు ను కారు గుర్తుకు వేసీ మరొసారి ఆశీర్వదించి అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని 
– డిండి మండలం చెరుకుపల్లి గ్రామంలో ఇంటింటికి  ప్రచారం నిర్వహించిన రమావత్ శ్యామల రవీంద్రకుమార్
నవతెలంగాణ- డిండి:    బీఆర్ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న సౌభాగ్యలక్ష్మి పథకం పేద మహిళలకు భరోసానిస్తుందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ సతీమణి రమావత్ రమావత్ శ్యామల రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం డిండి మండలం చెరుకుపల్లి గ్రామంలో ప్రజాప్రతినిధులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…. సౌబాగ్యలక్ష్మి పథకం ద్వారా ప్రతినెల 3వేల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రం భవిష్యత్‌ భద్రత బీఆర్ఎస్‌తోనే సాధ్యం అని, బీఆర్ఎస్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్దిని వివరించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. సీఎం కేసీఆర్‌ బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల అభ్యన్నతికి పెద్దపీట వేశారన్నారు. బీఆర్ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారికి ఓటు వేసి అభివృద్దికి తోడ్పడాలని ఆమె కోరారు. రవీంద్ర కుమార్ పాలనలో సాధించిన ప్రగతి వల్ల నియోజకవర్గంలోని గ్రామాలకు గుండె ధైర్యం వచ్చిందన్నారు. దేవరకొండ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్‌ సారథ్యంలో అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. ఈనెల 30 న మీ అమూల్య ఓటును కారు గుర్తుకు వేసి మరోసారి ఆశీర్వదించి అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ తుం నాగార్జున్ రెడ్డి, వైస్ ఎంపీపీ గోరేటి పుల్లమ్మ, గ్రామ శాఖ అధ్యక్షుడు బత్తిని  శ్రీనివాస్ రెడ్డి, ముత్యాల రవీందర్ రెడ్డి, ముత్యాల యాదవ్ రెడ్డి, సుస్కాండ్ల ధర్మారెడ్డి, వార్డుమెంబర్ సుస్కాండ్ల లక్మమ్మ, తూం రాజేందర్ రెడ్డి, సాకలి లింగమయ్య, భగవంతరావు తదితరులు పాల్గొన్నారు.
Spread the love