ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి 

– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పెరుమాండ్ల తిలక్ బాబు 
నవతెలంగాణ – నెల్లికుదురు 
పుచ్చలపల్లి సుందరయ్య  39వ వర్ధంతిని ఘనంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పెరుమల్ల తిలక్ బాబు తెలిపాడు. మండల కేంద్రంలో సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల  కార్యదర్శి పెరమాండ్ల తిలక్ బాబు మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశం మ్యూనిస్టు ఉద్యమ నిర్మాత. నెల్లూరు జిల్లా అలగానిపాడు లో పుట్టిన, అణగారిన ప్రజల కోసం అనేక సేవలు చేసి చిన్న వయసులోనే జైలు జీవితం గడిపి ప్రజా సేవలో ఉండి. గొప్ప పార్లమెంటేరియన్ గా పేరు పొంది. విశాలాంధ్రలో ప్రజారాజ్యం. రాసి,వీర తెలంగాణ.సాయుధ పోరాటానికి నాయకత్వం. వహించిన గొప్ప మహానుభావుడు అని అన్నారు. పీడిత ప్రజల అనగారిన వర్గాల ప్రయోజనాల కోసం మార్క్సిజమే సరైనది అని నమ్మి ఉన్నత ఆశయాల కోసం నిరంతరం శ్రమించిన శ్రమజీవుల పక్షపాతి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని అన్నారు. వర్ధంతి సభలో బాణాల యాకన్న ఐలు గణేష్ బాబు గౌడ్ గుగులోత్ శ్రీనివాస్ వెంకన్న మోహన్ శోభన్ చాంప్ల మొదలగుకున్నవారు పాల్గొన్నారు.
Spread the love