పసర పొలీస్ స్టేషన్ పరిధి లో 5 గురు వ్యక్తుల రిమాండ్

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని వసర పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్తు తీగలు అమర్చి వ్యక్తి మృతికి కారణమైన ఐదుగురిని శనివారం రిమాండ్ కు తరలించినట్లు ఎస్ ఐ కమలాకర్ తెలిపారు. ఎస్ ఐ కమలాకర్ కథనం ప్రకారం గత నెల 12 వ తేదీన పసర పోలీస్ స్టేషన్ పరిధి లో 5 గురు వ్యక్తులు వన్యప్రాణులను వేటాడుట కొరకు కరెంట్ తీగలు అమర్చడం తో దుంపెల్లిగూడెం కు చెందిన పిండి రమేష్ అను వ్యక్తి ప్రమాదవశాత్తు వాటికి తాకి మృతి చెందడం జరిగింది. వెంటనే అప్పటి పసర ఎస్సై షేక్ మస్తాన్  కేసు నమోదు చేయడమైనది. కేసు తీవ్రత దృశ్య సీఐ శంకర్  దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకొని ములుగు కోర్ట్ లో హాజరుపర్చి ఖమ్మం జైలు కు తరలించడమైనదనీ అన్నారు. నిందితుల వివరాలు..1)ఎర్రబోయిన అశోక్,2)పన్నల శ్రీనివాస్ రెడ్డి, 3)నద్దునూరి కోటయ్య,4)నద్దునూరి సందీప్,5) అజ్మీరా స్వామి ఈ సందర్బంగా సీఐ  శంకర్ మాట్లాడుతూ ఎవరైన కరెంట్ తీగలు పెట్టి మనుషులకు ప్రమాదాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Spread the love