దోస్త్‌కు 70,315 మంది రిజిస్ట్రేషన్‌

– 36,020 వెబ్‌ఆప్షన్ల నమోదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేషనల్‌, బీకాం ఆనర్స్‌, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ, బీసీఏ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌)కు 70,315 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్‌, దోస్త్‌ కన్వీనర్‌ ఆర్‌ లింబాద్రి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈనెల 10వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు గడువున్నదని తెలిపారు. ఇప్పటి వరకు 36,020 వెబ్‌ఆప్షన్లు నమోదయ్యాయని వివరించారు. ఈనెల 11వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్లను నమోదు చేసేందుకు అవకాశమున్నదని పేర్కొన్నారు. ఈనెల 16వ తేదీన తొలివిడత సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. విద్యార్థులు పూర్తి వివరాలకు ష్ట్ర్‌్‌జూర://సశీర్‌.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

Spread the love