ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో 8 మంది బైండోవర్

నవతెలంగాణ – గోవిందరావుపేట
ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో మండలంలోని పసర పోలీస్ స్టేషన్ పరిధిలో 8 మంది వ్యక్తులను తాహసిల్దార్ సృజన్ కుమార్ ముందు బుధవారం బైండోవర్ చేయడం జరిగిందని ఎస్ ఐ ఏ కమలాకర్ తెలిపారు. ఎస్ ఐ కమలాకర్ కథనం ప్రకారం పసర గ్రామానికి చెందిన ఎం సత్యనారాయణ, జి నాగేశ్వరరావు, బి చక్రమ్మ లు చంద్రు తండా నుండి బి తారచంద్, దుంపలగూడెం గ్రామం నుండి బి వెంకట్ రామ్, సండ్రగూడెం నుండి అజ్మీర వాల్య, అజ్మీర రవీందర్, హాట్కర్ సేవ లను అదుపులోకి తీసుకుని భవిష్యత్తులో ఎలాంటి తప్పులు చేయకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ముందు జాగ్రత్తగా తహసీల్దార్ సృజన్ కుమార్ ముందు బైండోవర్ చేయడం జరిగిందని అన్నారు.
Spread the love