టీఎస్ ఈసెట్ తుది విడుత‌లో 88.53 శాతం సీట్లు భ‌ర్తీ

నవతెలంగాణ – హైదరాబాద్
టీఎస్‌ ఈసెట్ తుది విడత కౌన్సెలింగ్‌లో 88.53 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. పాలిటెక్నిక్‌, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్‌లో ల్యాట్రల్‌ ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్‌లో శుక్ర‌వారం తుది విడుత‌ సీట్లు కేటాయించారు. ఈ ఏడాది ఈసెట్‌లో 20,895 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరిలో 13,188 మంది విద్యార్థులు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరుకాగా, తుది కౌన్సెలింగ్‌లో 8,150 మంది వెబ్‌ఆప్షన్లు ఎంచుకొన్నారు. ఇంజినీరింగ్‌లో 11,855, ఫార్మసీలో 1228 సీట్ల చొప్పున మొత్తం 13,083 సీట్లున్నాయి. ఇంజినీరింగ్‌లో 10,496 సీట్లు భర్తీ అయ్యాయి. ఫార్మసీలో 77 సీట్లు నిండాయి. మ‌రో 2,510 సీట్లు ఖాళీగా ఉన్నాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 26 నుంచి 29వ తేదీ లోపు ఫీజు చెల్లించి, సెల్ఫ్‌రిపోర్టింగ్‌ చేయాలని అధికారులు సూచించారు. లేని యెడ‌ల సీటు క్యాన్షిల్ కానుంది.

Spread the love