గాలికుంటు టీకాలపై అవగాహనా సదస్సు

నవతెలంగాణ-దమ్మపేట
మండలంలోని గణేష్‌ పాడు నాగుపల్లిలో గ్రామంలో గాలికుంటు టీకాల కార్యక్రమం పై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి మన్యం రమేష్‌ బాబు మాట్లాడారు. ఆగస్టు ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్‌ ఆరు వరకు మండలంలో జరిగిన గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల మీద రైతులకు అవగాహన సదస్సు నిర్వహించి, టీకాలు చేయబడిన 26 పశువుల నుంచి రక్త నమూనాలను సేకరించినట్టు తెలిపారు. ఈ రక్తన మూలాల నుంచి వ్యాధి నిరోధక శక్తిని అంచనా వేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డయాగ్నొస్టిక్‌ లాబ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అరుణ, ట్రైనింగ్‌ డాక్టర్స్‌, మండల పరిషత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love