సాయుధ పోరాట వారోత్సవ సభను జయప్రదం చేయండి

Celebrate the Armed Struggle Week– సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.కనకారెడ్డి
నవతెలంగాణ-జనగామ
సెప్టెంబర్‌ 17న జనగామ పట్టణంలో జరుగు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవ ముగింపు సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్య దర్శి ఏం కనకా రెడ్డి విజ్ఞప్తి చేశారు.బుధవారం పార్టీ కార్యాలయంలో ముఖ్య నా యకుల సమావేశం ఈఅహల్య అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశంలో కను కా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దేశ చరిత్రలో సు వర్ణ అక్షరాలతో లెక్కించబడ్డ పోరాటమని అన్నారు. సాయుధ పోరాట ఫలితంగా దేశంలో భూసంస్కరణలు అమలు కావడానికి నాంది పలికిందన్నారు. భూ పం పిణీ జరిగిన తర్వాత దేశం అభివృద్ధిలో ముందడుగు వేసిందన్నారు. సాయుధ పో రాటంలో 4000 మంది అమరులైనారని తెలిపారు. అదేవిధంగా 10 లక్షల ఎక రాల భూమి పేదలకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం పంచడం జరిగింది అన్నా రు. ఈ పోరాట ఫలితంగా తెలంగాణ ప్రాంతంలో దోపిడీ, అణచివేత, అంటరా నితనం పోవడానికిదోహదం చేసిందన్నారు. ఇలాంటి మహౌత్తరమైన పోరాటం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఈ పోరాట చరిత్రను వక్రీకరించిప్రజల మధ్య చిచ్చు పెట్టే దుర్మార్గమైన ప్రచారం చేస్తుందన్నారు. బడా మీడియా కార్పొరేట్‌ శక్తులు బిజెపి వంత పాడుతూ చరిత్ర వాస్తవాలను వక్రీకరించడం దుర్మార్గమన్నారు. ఆనాడు సాధించుకున్న భూములను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగల్లాగా అభివృద్ధి పేరుతో అక్రమంగా పేదల భూములు లాక్కొని రైతులను కూలీలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. భూములన్ని కార్పొరేట్‌ శక్తులకు అంబానీ ఆదాని లకు అప్పజెప్తుంది అన్నారు. పేదలకు ఉండడానికి ఇల్లు లేదు, ఇంటి స్థలం లేదు కానీ కార్పొరేట్‌ శక్తులకు అడిగిందే తడవుగా వేల ఎకరాలభూములు అప్పజెప్తు న్నారని విమర్శించారు. తెలంగాణ రైతాంగపోరాట స్ఫూర్తితో ప్రజలు ఉద్యమిం చాలని అన్నారు.ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్‌ రాజ్‌, ఎస్‌.యాదగిరి, జిల్లా కమిటీ సభ్యులు జోగు ప్రకాష్‌, విజేందర్‌, బి.చందు నాయ క్‌, సురేష్‌, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love