- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల పిలుపు మేరకు బిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ నైతిక మద్దతు తెలుపడంతో భువనగిరి మాజీ శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి ఆదేశానుసారంతో భువనగిరి పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించి బంధును జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే 42 శాతం రిజర్వేషన్ను అమలుపరిచే విధంగా చేయాలని లేని పక్షంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున మునుముందు ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. బీసీలకు బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ పద్ధతిగా ఉంటుందని తెలిపారు.
- Advertisement -